ఎయిర్​టెల్​ సేవలకు అంతరాయం

న్యూఢిల్లీ : టెలికం ఆపరేటర్​ఎయిర్​టెల్​ సేవలు గురువారం కొంతసేపు ఆగిపోయాయి. మొబైల్​లో సిగ్నల్​ రావడం లేదని, బ్రాడ్​బ్యాండ్​కూడా పనిచేయడం లేదంటూ ఉదయం 10.30 గంటల టైమ్‌లో వందలాది మంది నుంచి ఫిర్యాదులు వచ్చాయని డౌన్​డిటెక్టర్​డాట్​ ఇన్​ వెబ్​సైట్​ పేర్కొంది. ఇదే విషయమై చాలా మంది యూజర్లు ‘ఎక్స్​’ ద్వారా కూడా ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉంటే, ఇండియన్​ రైల్వేల ఆన్​లైన్​ టికెటింగ్​ ప్లాట్​ఫామ్​ఐఆర్​సీటీసీ కూడా గురువారం మొరాయించింది. వెబ్​సైట్​తోపాటు మొబైల్​యాప్​ పనిచేయలేదని ఫిర్యాదులు వచ్చాయి. మెయింటనెన్స్​పనుల వల్ల ఇలా జరిగిందని కంపెనీ వివరణ ఇచ్చింది. ఐఆర్​సీటీసీ సేవలకు అంతరాయం రావడం ఈ నెలలో ఇది రెండోసారి.