Airtel Outage: ఎయిర్‌టెల్ నెట్‌వర్క్​ డౌన్.. కోట్ల మంది కస్టమర్ల గగ్గోలు

ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సేవల్లో గురువారం(డిసెంబర్ 26) అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాలతో ఎయిర్‌టెల్ మొబైల్, ఎయిర్‌టెల్ బ్రాడ్ బ్యాండ్ సేవలు దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. దాంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వెళ్లగక్కారు. 

అంతరాయాలను ట్రాక్ చేసే డౌన్‌డెటెక్టర్ ప్రకారం, దాదాపు 3,000 కంటే ఎక్కువ పైగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో 47 శాతం మంది కస్టమర్లు మొబైల్ సిగ్నల్ సమస్యను పేస్ చేయగా.. 30 శాతం మంది మొత్తం సర్వీస్ బ్లాక్‌అవుట్‌ సమస్యను ఎదుర్కొన్నట్లు ఫిర్యాదు చేశారు. మరో 23 శాతం మంది మొబైల్ ఇంటర్నెట్ పనిచేయడం ఇబ్బంది పడ్డారట. 

సోషల్ మీడియా పోస్ట్‌ల ప్రకారం.. ఎయిర్‌టెల్ అంతరాయం గుజరాత్‌లోని వినియోగదారులను ఎక్కువగా ప్రభావితం చూపినట్లు తెలుస్తోంది. ఎయిర్​టెల్ యాజమాన్యాన్ని తిడుతూ నెట్టింట అడ్డగోలు పోస్టులు పెడుతున్నారు. ఎన్ని గంటలైతే అంతరాయం కలిగిందో ఆ సమయాన్ని పొడిగించాలని ప్రశ్నిస్తున్నారు. అయితే, దీనిపై ఎయిర్‌టెల్ మాత్రం స్పందిచలేదు. నెట్‌వర్క్ డౌన్​ సమస్యకు గల కారణాలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం.. వినియోగదారుల్లో ఆగ్రహాన్ని మరింత పెంచుతోంది.ఇప్పటికీ దేశంలో కొన్ని చోట్ల ఎయిర్​టెల్ సేవల్లో సమస్యలు ఉన్నట్లు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.