ఆదిలాబాద్ లో ఎయిర్​పోర్ట్​ నిర్మించాలి :ఎంపీ గోడం నగేశ్​

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మో హన్ నాయుడును ఎంపీ గోడం నగేశ్​ కోరారు. శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. విమానాశ్రయ ఏర్పాటుకు ఇప్పటికే 1592 ఎకరాల భూమిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించామని వివరించారు. విమానాశ్రయం జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని, తప్పకుండా ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.