ఎయిర్​ఇండియా, ఇండిగోలో బ్లాక్​ఫ్రైడే ఆఫర్లు

న్యూఢిల్లీ:  విమానయాన సంస్థలు ఎయిర్​ఇండియా, ఇండిగో బ్లాక్ ఫ్రైడే సేల్​ను ప్రారంభించాయి. ఎయిర్​ఇండియా శుక్రవారం నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు బుక్​ చేసుకునే డొమెస్టిక్​, ఇంటర్నేషనల్​ టికెట్లపై భారీ రాయితీలు ఇస్తామని ప్రకటించింది. ఎయిర్ ఇండియా  బ్లాక్ ఫ్రైడే సేల్‌‌‌‌‌‌‌‌లో దేశీయ విమానాల్లో 20 శాతం వరకు  అంతర్జాతీయ రూట్‌‌‌‌‌‌‌‌లలో 12 శాతం వరకు చార్జీల తగ్గింపు ఉంటుంది.  

వచ్చే ఏడాది జూన్ 30లోపు చేసే ప్రయాణాలకు ఈ  ఆఫర్స్​ వర్తిస్తాయి.  ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా మధ్య విమానాల కోసం పొడిగించిన విండో, అక్టోబర్ 30, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. అయితే, సీట్లు పరిమితంగా ఉంటాయి.  ఇండిగో దేశీయ రూట్‌‌‌‌‌‌‌‌లకు రూ.1,199,  అంతర్జాతీయ రూట్లకు రూ.5,199 నుంచి వన్-వే చార్జీలను అందిస్తోంది. ఈ రేట్లు జనవరి  నుంచి మార్చి 31, 2025 వరకు చేసే ప్రయాణాలకు వర్తిస్తాయి.