100 ఎయిర్‌‌‌‌బస్‌‌ విమానాలు కొంటున్న ఎయిర్‌‌‌‌ ఇండియా

  • గతంలో ప్రకటించిన 470 విమానాలకు అదనం

న్యూఢిల్లీ: మరో 100 ఎయిర్‌‌‌‌బస్‌‌ విమానాలను కొనుగోలు చేసేందుకు ఎయిర్‌‌ ‌‌ఇండియా  సోమవారం అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇందులో 10 పెద్ద బాడీ ఏ350  విమానాలు, 90 చిన్న బాడీ ఏ320 విమానాలు, ఏ321 నియో విమానాలు ఉంటాయి.  ఎయిర్‌‌‌‌బస్‌‌, బోయింగ్ నుంచి 470 విమానాలను కొనుగోలు చేసేందుకు కిందటేడాది ఎయిర్‌‌‌‌ ఇండియా  ఒప్పందం కుదుర్చుకుంది. అదనంగా మరో 370 విమానాలు కొంటామని అప్పుడు ప్రకటించింది.  తాజా 100 విమానాల‌‌తో కలిపి 350 విమానాలను  ఎయిర్‌‌‌‌ బస్‌‌ నుంచి ఎయిర్ ఇండియా  కొనుగోలు చేస్తోంది.ఏ350 విమానాలకు కాంపోనెంట్లను, మెయింటెనెన్స్‌‌ సపోర్ట్‌‌ను ఎయిర్‌‌‌‌బస్ అందిస్తుందని  ఎయిర్‌‌‌‌ ఇండియా పేర్కొంది. 

 2023 లో చేసిన 470 విమానాల ఆర్డర్‌‌‌‌లో  ఎయిర్‌‌‌‌బస్ నుంచి 40 ఏ350 విమానాలు, 210 ఏ320, ఏ321 నియో విమానాలు ఉన్నాయి. బోయింగ్ నుంచి 20 బోయింగ్ 787, 10 బోయింగ్ 777–9 ఎస్ పెద్ద బాడీ విమానాలు, 190 బోయింగ్ 737 మ్యాక్స్‌‌ సింగిల్ ఐల్‌‌ విమానాలు ఉన్నాయి.  విమాన ప్యాసింజర్లు పెరుగుతున్నారని, ఎకానమీ వృద్ధి చెందుతోందని, యువత విదేశాలకు పెరగడం పెరిగిందని టాటా సన్స్ చైర్మన్న టరాజన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు.అందుకే తమ విమానాల సంఖ్యను పెంచుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు.