- రెడ్డీ జేఏసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి
హుస్నాబాద్, వెలుగు : గౌరవెల్లి ప్రాజెక్టుకు రూపకల్పన చేసి శంకుస్థాపన చేసిన ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్రాజశేఖరరెడ్డి పేరును ఆ ప్రాజెక్టుకు పెట్టాలని రెడ్డీ జేఏసీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు అయిలేని మల్లికార్జునరెడ్డి కోరారు. సోమవారం వైఎస్జయంతి సందర్భంగా ఆయన ఫొటోకు నివాళులర్పించి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ పాదయాత్ర ద్వారా ఈ ప్రాంతంలో కరువు పరిస్థితిని తెలుసుకున్నారన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గౌరవెల్లి ప్రాజెక్టును నిర్మిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి రాగానే ఇక్కడి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గౌరవెల్లి ప్రాజెక్టునకు శంకుస్థాపన చేసి సగం పనులను పూర్తిచేశారన్నారు. పేదలు, రైతుకూలీల సంక్షేమం కోసం ఆలోచించిన వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఆ ప్రాజెక్టునకు పెట్టాలని కోరారు.
ములుగు : ములుగు మండలం వంటిమామిడిలో కాంగ్రెస్నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో వైఎస్సీఎంగా ఉన్నప్పుడు వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్టాన్ని అభివృద్ధిపథంలో నడిపారని గుర్తుచేశారు.