ఫర్టిలైజర్ షాపు డీలర్లు .. లైసెన్స్ అప్డేట్ తప్పనిసరి

కౌడిపల్లి, వెలుగు: ఫర్టిలైజర్ షాపు డీలర్లు తప్పనిసరిగా షాపు లైసెన్సు అప్డేట్ చేసుకొని ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు తెలిపారు. మంగళవారం మండలంలోని బుజిరంపేట, తిమ్మాపూర్ ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఫర్టిలైజర్ షాప్ ల్లో యూరియా తీసుకునే ముందు డీలర్లు ఆధార్ కార్డు ఆన్​లైన్​చేసి యూరియా పంపిణీ చేయాలన్నారు.

రైతులకు విక్రయించే మందుల నోటీస్ బోర్డు షాపు ముందు కచ్చితంగా కనిపించాలన్నారు. ఫర్టిలైజర్ డీలర్లు అధిక డబ్బులు వసూలు చేయకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విక్రయించాలని అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.