జనవరి నుంచి కొలేటరల్ లేకుండా రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలు

న్యూఢిల్లీ : రూ. 2 లక్షల వరకు ఇచ్చే వ్యవసాయ రుణాలపై ఎటువంటి కొలేటరల్‌, మార్జిన్ డిపాజిట్లను జనవరి నుంచి తీసుకోవద్దని అన్ని బ్యాంకులను ఆర్‌‌బీఐ ఆదేశించింది. ప్రస్తుతం  రూ.1.6 లక్షల  వరకు ఇచ్చే వ్యవసాయ రుణాలకు కొలేటరల్ అవసరం లేదు. కానీ, కొన్ని పరిస్థితుల్లో మార్జిన్ డిపాజిట్లను అడుగుతున్నారు. ఇన్‌ఫ్లేషన్‌ను దృష్టిలో పెట్టుకొని క్రెడిట్ లిమిట్‌ను పెంచారు.