కోరం లేక మీటింగ్ వాయిదా

నారాయణ్ ఖేడ్, వెలుగు : ఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండలంలో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ మీటింగ్ కోరం లేక పోస్ట్ పోన్ చేసినట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీపీ కొంగరి జయశ్రీ మోహన్ రెడ్డి, ఎంపీడీవో అలివేలు మంగమ్మ తెలిపారు. సోమవారం నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్ లో ఎంపీటీసీల కోరం లేకపోవడంతో మండలంలోని వివిధ సమస్యలను చర్చించి

సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే వివిధ శాఖల అధికారులకు సూచించారు.  వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎరువులను, విత్తనాలను సప్లై చేయాలని అగ్రికల్చర్ ఆఫీసర్లకు చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సెక్రటరీలు పాల్గొన్నారు. 

బెజ్జంకి మీటింగ్​ కూడా..

బెజ్జంకి : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ఎంపీపీ ఆఫీసులో సోమవారం జరగాల్సిన సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. సమావేశానికి  ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు హాజరు కాకపోవడంతో కోరం లేక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీపీ లింగాల నిర్మల తెలిపారు.  మండలంలో 13 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా, జడ్పీటీసీ సభ్యురాలు కనగండ్ల కవిత సైతం హాజరుకాలేదు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు బర్త్​డే వేడుకలకు వెళ్లినట్టు సమాచారం. సమావేశంలో ఎంపీడీవో లక్ష్మప్ప, సూపరింటెండెంట్అంజయ్య, అధికారులు పాల్గొన్నారు