ఢిల్లీ స్వాతంత్య్ర వేడుకలకు ఆదిలాబాద్ విద్యార్థి

జన్నారం, వెలుగు: ఆగస్టు 15న దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలకు జన్నారం మండలంలోని కిష్టాపూర్ గవర్నమెంట్ హైస్కూల్​లో గతేడాది టెన్త్ ​క్లాస్ ​చదివిన  ఆర్.విష్ణువర్దన్ అనే విద్యార్థికి ఆహ్వానం అందింది.గత సంవత్సరం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వికసిత్ భారత్ ప్రేరణ పోటీల్లో విష్ణువర్దన్ మొదటి స్థానంలో నిలిచాడు. దీంతో ఎర్రకోటలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానం అందినట్లు కిష్టాపూర్ హైస్కూల్ హెచ్​ఎం జి.రాజన్న తెలిపారు. విష్ణువర్దన్ ప్రస్తుతం హైదరాబాద్​లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. ఈ సందర్భంగా విష్ణువర్దన్​ను ఎంఈవో విజయ్ కుమార్, స్కూల్ టీచర్లు  అభినందించారు.