ఆదిలాబాద్, వెలుగు: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం కోరారు. జీఎంఆర్, రక్షణ సంస్థ సహకారంతో టెన్త్ పాసైన యువతీయువకులకు సెక్యూరిటీ గార్డు ఉద్యోగం కోసం మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జాబ్ మేళాను ఎస్పీ ప్రారంభించారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం వేచిచూడకుండా ప్రైవేటు రంగంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అడిషన్ ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు సునీల్ కుమార్, కరుణాకర్, ఫణిదర్, శ్రీనివాస్ పాల్గొన్నారు