కార్పొరేట్ల అవసరాల కోసం కుట్ర : జిల్లా కార్యదర్శి సాయిక్రిష్ణ

  • బడ్జట్​కు నిరసనగా నేడు  జిల్లా వ్యాప్తంగా నిరసనలు
  • ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాయిక్రిష్ణ

ఆసిఫాబాద్ ,వెలుగు : కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిని ఎస్ఎఫ్ఐ ఆసిఫాబాద్ జిల్లా కమిటీ గా తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా కార్యదర్శి చాపిలె సాయిక్రిష్ణ తెలిపారు. ఈ బడ్జెట్ ను నిరసిస్తూ బుధవారం జిల్లా వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తున్నామని అన్నారు.  మంగళవారం ఆయన మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు విద్యారంగానికి తీవ్ర నిరాశ మిగిల్చాయనీ, యువతకు ఉపాధి, నైపుణ్యానికి పెద్ద పీట పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అవసరాలను తీర్చే మానవ వనరులను తయారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు.  ఉన్నత విద్యను అభ్యసించే వారికి వడ్డీలేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్ కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ పాఠశాలలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు.   బడ్జెట్ పూర్తిగా   యువత భవిష్యత్తును కార్పోరేట్లకు తాకట్టు పెట్టే విధంగా ఉందన్నారు.