బజార్త్నూర్, వెలుగు: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా రెండు మొక్కలు నాటాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వగ్రామం జాతర్లలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో మండల నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఆ మొక్కకు తన తల్లి బీంబాయి పేరును పెట్టారు.
వాతావరణ మార్పుల నేపథ్యంలో ఇప్పటికైనా మేల్కొని మొక్కలు నాటి వాటిని రక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పోరెడ్డి శ్రీనివాస్, నాయకులు మేకల వెంకన్న, నానం రమణ, ఈశ్వర్, బోజారెడ్డి, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.