మున్నూరు కాపుల అభివృద్ధికి కృషి చేస్తా

  • ఎమ్మెల్సీ దండే విఠల్ ఖానాపూర్ లో రైతు విగ్రహావిష్కరణ

ఖానాపూర్, వెలుగు: మున్నూరు కాపుల అభివృద్ధి కృషి చేస్తానని.. ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా వారికి పూర్తిస్థాయిలో అండగా ఉంటామని అదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. ఖానాపూర్ పట్టణంలోని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు విగ్రహ ఆవిష్కరణకు ఎమ్మెల్యే బొజ్జు పటేల్, మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి దండే విఠల్​ హాజరయ్యారు. రైతు విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. మున్నూరు కాపు సహకార సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్​లో రూ.50 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు.

 బీసీలకు రాజకీయంలో న్యాయం జరగాలంటే కాపులు అన్ని కులాలను కలుపుకొని పోవాల న్నారు. అంతకుముందు పట్టణంలోని విశ్రాంతి భవనం నుంచి రైతు విగ్రహ వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్లు గండ్రత్ ఈశ్వర్, చిన్నం సత్యం, బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, బీజేపీ నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, స్థానిక మున్నూరు కాపు నాయకులు కడుకుంట్ల రవి, ఆకుల శ్రీనివాస్, బీసీ రాజన్న, దయానంద్, రాములు, రమేశ్, ప్రదీప్, నాగరాజు, రవి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.