ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి మెయిన్ గేట్ముందు వెలిసిన ఆక్రమణలకు బుధవారం పోలీసుల సహకారంతో మున్సిపల్అధికారులు తొలగించారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించేలా ఉన్న షెడ్లను తొలిగించినట్లు డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
రోడ్డు ప్రక్కన్న ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు లేకుండా ఆక్రమణలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు, మున్సిపల్సానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.