యువత చదువుతో పాటు క్రీడల్లో ముందుండాలి : కలెక్టర్​ రాజర్షి షా

ఆసిఫాబాద్/ ఆదిలాబాద్​టౌన్, వెలుగు: యువత, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ముందుండాలని ఆదిలాబాద్ ​కలెక్టర్​ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సీఎం కప్ 2024 కార్యక్రమంలో భాగంగా 2కే రన్ తో పాటు ప్రపంచ ఎయిడ్స్ డే ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలు, యువకులకు, విద్యార్థులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకే 2కే రన్ నిర్వహించామని పేర్కొన్నారు. 

ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం ప్రజాపాలన విజయోత్సవాలు సందర్భంగా జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వ ర్యంలో సారథి కళాకారులతో రూపొందించిన ప్రజాపాలన ఆడియో సాంగ్ ఆవిష్కరించారు. డీపీఆర్​వో తిరుమల, డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు, పార్థసారథి, వైద్యాధికారి నరేందర్, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

క్రీడల్లో రాణించేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నం

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని ఆసిఫా బాద్​ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. ప్రజాపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. సీఎం కప్ పోటీల సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం 2కే రన్ పోటీలు నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే జెండా ఊపి ప్రారంభించారు.

 కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన 2కే రన్ లో అధికారులు, విద్యార్థులు, యువతతో కలిసి కలెక్టర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, యువత చదువుతోపాటు, రోజూ కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించాలని సూచించారు. క్రీడాకా రులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందన్నారు.