వెలుగు, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా చిన్నారులతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ మండలం అంకోలి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. చిన్నారులతో కాసేపు ముచ్చటించి వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు.
డ్రై డే సందర్భంగా గ్రామంలో పర్యటించి ఇంటి పరిసరాల్లో ఉన్న కుండీలు, డ్రమ్ములు, వాడుకలో లేని వస్తువుల్లో నీటి నిల్వల కారణంగా దోమలు చేరి అనారోగ్యం బారినపడతామని, ఆ నీటిని తొలగించాలని సూచించారు. స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటారు. ప్రత్యేక అధికారి పద్మభూషణ్, డీఆర్డీవో సాయన్న, డీఎల్పీవో ఫణీంద్ర, ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి, వైద్యాధికారులు పాల్గొన్నారు.