గ్రూప్​వన్ ​పరీక్షకు ఏర్పాట్లు పూర్తి : అడిషనల్​ ఎస్పీ మహేందర్​

మెదక్​టౌన్​, వెలుగు: జిల్లాలో గ్రూప్​ వన్​ రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అడిషనల్​ ఎస్పీ మహేందర్​ తెలిపారు. గురువారం మెదక్  గవర్నమెంట్​ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ హుస్సేన్​ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎస్పీ మహేందర్​ మాట్లాడుతూ..ఈ నెల 9న  గ్రూప్--1 ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకుంటామన్నారు. దీనికి వీలుగా అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందుగానే రావాలన్నారు.

పరీక్షకు సంబంధించిన నిబంధనలు హాల్ టికెట్​లో ఉంటాయని వాటిని ఒకటికి రెండుసార్లు చదువుకోవాలన్నారు. అలాగే పరీక్ష హాల్​లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులకు అనుమతి ఉండదని, చేతులకు గోరింటాకు పెట్టుకోవద్దని సూచించారు. సమావేశంలో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్​ హుస్సేన్​,  మధుసూదన్ గౌడ్, అనిల్ కుమార్, రవీందర్​, సందీప్​రెడ్డి, చీప్ సూపరింటెండెంట్లు,  అబ్జర్వర్లు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు.