రోడ్డు సమస్య పరిష్కరించిన అడిషనల్ కలెక్టర్

మెదక్, వెలుగు: అడిషనల్​కలెక్టర్​వెంకటేశ్వర్లు గురువారం మెదక్ పట్టణంలో 8 ,9వ వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్​కమిషనర్, పోస్టల్​డిపార్ట్​మెంట్​ ఆఫీసర్​లతో కలిసి పోస్టల్​డిపార్ట్​మెంట్​క్వార్టర్స్​వెనుక భాగంలో నెలకొన్న రోడ్డు సమస్యను పరిష్కరించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా  పోస్టల్ క్వార్టర్స్​సమాంతరంగా గోడ నిర్మించి ప్రజలకు రహదారి కల్పించాలని మున్సిపల్ కమిషనర్​ను ఆదేశించారు.

అనంతరం మెదక్ ఐసీడీఎస్​ఆఫీస్​ను ఆకస్మికంగా పరిశీలించి సిబ్బంది విధులకు హాజరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలల సదనాన్ని సందర్శించి స్టూడెంట్స్​కు అందుతున్న మెనూ పరిశీలించారు. క్వాలిటీ ఎడ్యుకేషన్​ అందించాలని, మెనూ విషయంలో రాజీ పడకూడదని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ సాగర్, మున్సిపల్ చైర్మన్​చంద్రపాల్, పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీహరి పాల్గొన్నారు.