ప్రకృతిని కాపాడుకోవాలి : రమేశ్​

మెదక్​టౌన్​, వెలుగు: జీవ వైవిధ్యం భవిష్యత్​తరాలకు విలువైన ఆస్తి అని అడిషనల్​కలెక్టర్​రమేశ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్​ఆఫీసులో ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఈవో రాధాకృష్ణ, కో-ఆర్డినేటర్స్ సుదర్శన్, మూర్తి, స్టూడెంట్స్​తో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్​ కలెక్టర్​ మాట్లాడుతూ.. మానవ మనుగడ జీవ వైవిద్యం మీద ఆధారపడి ఉందని, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అడవుల నరికివేత వల్ల సకాలంలో వర్షాలు పడడం లేదన్నారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని తెలిపారు.