సాయంత్రానికే పీహెచ్​సీ క్లోజ్​​..  అడిషనల్​ కలెక్టర్​ ఆగ్రహం..

  • అడిషనల్​ కలెక్టర్​ ఆగ్రహం..

దహెగాం, వెలుగు: దహెగాం మండల కేంద్రం లోని పీహెచ్​సీకి ఆకస్మిక తనిఖీకి వచ్చిన అడిషనల్​ కలెక్టర్​ దీపక్​ తివారి అవాక్కయ్యారు. సాయంత్రం నాలుగింటికే పీహెచ్​సీకి తాళం పడటంతో ఆయన ఆగ్రహించారు. వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్​ఓకు చెప్పారు.

అనంతరం మండలంలోని పెసరిగుంట గ్రామాన్ని సందర్శించి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు ఉన్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఏపీఎం చంద్రశేఖర్, ఆర్ఐ నాందేవ్, సర్వేయర్​ ధన్​రాజ్​పాల్గొన్నారు.