ఆస్తి పన్ను వసూళ్లను స్పీడప్​ చేయాలి : అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట మున్సిపాల్టీలో ఆస్తి పన్ను వసూళ్లను మరింత స్పీడప్​చేసి లక్ష్యాలను సాధించే విధంగా సిబ్బంది పనిచేయాలని అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. మంగళవారం  మున్సిపల్  కమిషనర్ అశ్రిత్ కుమార్ తో కలిసి మున్సిపల్​ఆఫీసులో రెవెన్యూ, ట్రేడ్ లైసెన్స్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీబీ వివరాలను పరిశీలించి ఇంటి పన్ను వసూలు గురించి ఆరా తీశారు. ఆస్తి పన్ను వసూళ్లలో  సిద్దిపేట పురపాలక సంఘం ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేయాలని, మార్చి 31 వరకు వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. 

ఈ విషయంపై  ప్రతిరోజు బిల్ కలెక్టర్లు  పన్ను వసూలు వివరాలను అందజేయాలని, పని విభజనతో ప్రతిరోజు టార్గెట్ ను సాధించేలా చూడాలన్నారు. పాత బకాయిలు, ప్రస్తుత బకాయిలు తప్పనిసరిగా వసూలు చేయాలని, వర్తక వాణిజ్య సంస్థలు తప్పకుండా ట్రేడ్ లైసెన్స్ పొందేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో మేనేజర్  శ్రీనివాస్ రెడ్డి, డీఈ ప్రేరణ, ఏఈ పృధ్వీ, ఆర్వో శ్రీకాంత్, ఆర్ఐలు బాలకృష్ణ, భారతీ, అజ్మత్ అలీ, బిల్ కలెక్టర్లు, ట్రేడ్ లైసెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.