బిహార్‌‌‌‌‌‌‌‌లో అదానీ గ్రూప్ రూ.28 వేల కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ బిహార్‌‌‌‌‌‌‌‌లో రూ.28 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది.  థర్మల్‌‌‌‌ పవర్ ప్లాంట్‌‌‌‌ను నిర్మించడానికి ఈ ఫండ్స్ వాడనుంది. సిమెంట్ ప్రొడక్షన్‌‌‌‌ పెంచే ఆలోచనలోనూ  ఉంది. కీలకమైన బిజినెస్‌‌‌‌లను విస్తరిస్తామని, కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటామని  బిహార్‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌  కనెక్ట్‌‌‌‌ 2024 లో అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌ డైరెక్టర్ ప్రణవ్‌‌‌‌ అదానీ అన్నారు. 

అడ్వాన్స్డ్‌‌‌‌ థర్మల్ ప్లాంట్‌‌‌‌ను ఏర్పాటు చేయడానికి రూ.20 వేల కోట్లు ఇన్వెస్ట్  చేస్తామని,  12 వేల ఉద్యోగాలు వస్తాయని ఆయన వివరించారు. వేర్‌‌‌‌‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ కెపాసిటీని పెంచడానికి, ఈవీ బిజినెస్‌‌‌‌, సిటీ గ్యాస్‌‌‌‌ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌, కంప్రెస్డ్‌‌‌‌ బయోగ్యాస్ బిజినెస్‌‌‌‌లను విస్తరించడానికి రూ.2,300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ప్రణవ్ పేర్కొన్నారు. అదనంగా 27 వేల ఉద్యోగాలు  వస్తాయన్నారు. 

అదానీ లంచం కేసు అటార్నీ రాజీనామా

లంచం కేసుపై అదానీకి వ్యతిరేకంగా యూఎస్‌‌‌‌ కోర్టులో వాదించిన అటార్నీ (గవర్నమెంట్‌‌‌‌ లాయర్‌‌‌‌‌‌‌‌) బ్రయన్‌‌‌‌ పీస్‌‌‌‌ (53) వచ్చే నెల 10 న తన పదవికి రాజీనామా  చేయనున్నారు. సింగర్  ఆర్‌‌‌‌‌‌‌‌ కెల్లీ సెక్స్‌‌‌‌ ట్రాఫికింగ్ కేసు వంటి హై ఫ్రొఫైల్ కేసులను వాదించారు.  పీస్‌‌‌‌ను  ప్రస్తుత యూఎస్ ప్రెసిడెంట్  బైడెన్‌‌‌‌ 2021 లో నియమించారు.