Adani Group: రూ.1.20 లక్షల కోట్లు పెరిగిన అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్

స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్  పుంజుకుంది. బుధవారం ( నవంబర్ 27) అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.20 లక్షల కోట్లు పెరిగింది. దీంతో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పవర్, అదాని పోర్ట్ , స్పెషియల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ కలిపి అదానీ గ్రూప్ క్యాపిటలైజేషన్ మొత్తం విలువ 12.59 లక్షల కోట్లకు చేరింది. 

నిఫ్టీ ఇండెక్స్ లో 24 పాయింట్లతో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్ ఈ పెరుగుదలలో కీలకంగా ఉన్నాయి. 13 పాయింట్లతో నిఫ్టీ ఓవరాల్ లాభాల్లో అదానీ ఎంటర్ ప్రైజెస్  సెకండ్ హైయస్ట్ కంట్రిబ్యూటర్ గా ఉంది.  అదానీ పోర్ట్స్ నిఫ్టీ ఇండెక్స్ 11 పాయింట్ల సహకారం అందించింది.  బుధవారం నాడు నిఫ్టీలో టాప్ కంట్రిబ్యూటర్ గా HDFC బ్యాంక్ నిలిచింది.  

ఇవాళ్టి స్టాక్ మార్కెట్లో అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ షేర్లు 19.78 శాతం పెరిగాయి.అదేవిధంగా అదానీ పవర్ 19.01 శాతం, అదానీ ఎంటర్ ప్రైజెస్  స్టాక్స్ 11.50 శాతం పెరిగి రూ. 2,397.80 చేరాయి. 

అమెరికా న్యాయశాఖ ఆరోపించిన లంచం కేసులో అదానీ ఎనర్జీ గ్రూప్ చేసిన ప్రకటనతో స్టాక్ మార్కెట్లో ఈ ర్యాలీ నెలకొంది. ఈ కేసులో గౌతమ్ అధానీ, సాగర్ అదానీ, వ్నీత్ జైన్ జైన్ల పేర్లు ఈ కేసులో ప్రస్తావనకు రాలేదని స్పష్టం చేసింది అదానీ ఎనర్జీ గ్రూప్. 

బుధవారం ఎర్లీ మార్నీంగ్ స్టాక్ ఎక్చేంజీలో అదానీ గ్రీన్ ఎనర్జీ ఈ ప్రకటన చేసింది. అదానీ అవినీతి లంచం తీసుకున్నట్లు వస్తున్న వార్తలు తప్పు అని ప్రకటించింది. దీంతో స్టాక్ మార్కెట్ అదానీ గ్రూప్ క్యాపిటలైజేషన్ 1.20 లక్షల కోట్లు పెరిగింది.