Bihar Power Plant: థర్మల్ పవర్ప్లాంట్..అదానీ గ్రూప్ 20వేల కోట్ల పెట్టుబడులు

బీహార్  లో అదానీ గ్రూప్ తన వ్యాపార  సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది.. ఇప్పటికే రాష్ట్రంలో సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ , లాజిస్టిక్స్ లలో తన కార్యకలాపాలను పెంచిన అదానీ గ్రూప్.. తాజా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు సిద్దమయింది. 

థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులో 20వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. బీహార్ బిజినెస్ కనెక్ట్ 2024 ఈవెంట్ లో ఈ విషయాన్ని అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రణవ్ అదానీ వెల్లడించారు. 

అదానీ గ్రూప్.. బీహార్ లో ఇప్పటికే లాజిస్టిక్స్ , గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, అగ్రి లాజిస్టిక్స్  రంగాల్లో రూ. 850 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఎలక్ట్రిక్ వెహికల్ (EV) , సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, వేర్ హౌసింగ్, హ్యాండ్లింగ్ కెపాసిటీలో అదనంగా రూ. 2వేల 300 కోట్ల పెట్టుబడులు ఇంజెక్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

ALSO READ | రాజ్యాంగంపై బీజేపీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లండి : ప్రియాంక గాంధీ

బీహార్ లో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అదానీ ఎంటర్ ప్రైజెస్ తెలిపింది. స్థానికంగా ఉన్న 4వేల మందికి ఉద్యోగాలు, విద్యుత్ ఆటోమేట్ చేయబడుతుంది. 

భారతదేశ ఆర్థిక వృద్ధికి గణనీయమైన సహకారాన్ని అందించేందుకు పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ ఉత్పత్తి, ఓడరేవులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక సదుపాయాల వంటి రంగాలలో ప్రసిద్ధి చెందిన అదానీ గ్రూప్  పనిచేస్తుంది. 

అదానీ గ్రూప్ పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా ఉండాలనే లక్ష్యంతో సౌర , పవన విద్యుత్ ప్రాజెక్టులతో సహా గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలలో పురోగతి సాధించింది.