అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ రెవెన్యూ .. 2 ఏళ్లలో రూ.1.5 లక్షల కోట్లు

  • వెంచుర సెక్యూరిటీస్ రిపోర్ట్‌‌‌‌

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ఫ్లాగ్‌‌‌‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ రెవెన్యూ 2026–27 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.1.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని, నికర లాభం ఏడాదికి 46 శాతం చొప్పున పెరుగుతుందని వెంచుర సెక్యూరిటీస్‌‌‌‌ ఓ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది. ప్రస్తుతం అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ కింద అదానీ గ్రూప్‌‌‌‌కు చెందిన ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్, సోలార్ మాడ్యుల్స్ తయారీ, విండ్‌‌‌‌ టర్బైన్‌‌‌‌లు, గ్రీన్ హైడ్రోజన్‌‌‌‌, రోడ్డు కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌, డేటా సెంటర్, కాపర్ బిజినెస్‌‌‌‌లు ఉన్నాయి. 

గౌతమ్‌‌‌‌ అదానీపై యూఎస్‌‌‌‌లో లంచం కేసు నమోదైనా,  కంపెనీ షేర్లు రికవర్ అవ్వగలిగాయి.ఈ రిపోర్ట్ ప్రకారం,  ప్రభుత్వం తెచ్చిన గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ (సైట్‌‌‌‌) ప్రోగ్రామ్‌‌‌‌తో అదానీ గ్రీన్ హైడ్రోజన్‌‌‌‌,  ఎలక్ట్రోలైట్ల తయారీకి ప్రయోజనం ఉంటుంది.  అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ కింద ఉన్న ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్ బిజినెస్ వాల్యూని  రూ.1.87 లక్షల కోట్లుగా వెంచుర సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. రోడ్డు కన్‌‌‌‌స్ట్రక్షన్ బిజినెస్ విలువ రూ.52,056 కోట్లుగా, కోల్‌‌‌‌ బిజినెస్ విలువ రూ.29,855 కోట్లుగా,  డేటా సెంటర్ బిజినెస్ విలువ రూ.11,003 కోట్లుగా లెక్కించింది. గ్రీన్ హైడ్రోజన్‌‌‌‌ అండ్ క్లీన్ ఎనర్జీ బిజినెస్ విలువ మాత్రం రూ.1.86 లక్షల కోట్లుగా, కాపర్ బిజినెస్‌‌‌‌ విలువ రూ.27,442 కోట్లుగా ఉందని తెలిపింది.