పక్షులను కాపాడుకోవాలి : వరల్డ్​ వైడ్​ ఫెడరేషన్ బృంద

బెల్లంపల్లి రూరల్, వెలుగు : నెన్నెల మండలంలోని జోగాపూర్ అటవీ, ప్రాజెక్టు ప్రాంతాల్లో వందకుపైగా పక్షి జాతులు, 20 రకాల సీతాకోక చిలుకలను గుర్తించామని వరల్డ్​ వైడ్​ ఫెడరేషన్​(డబ్ల్యూడబ్ల్యూఎఫ్​) బృంద ప్రతినిధులు హర్ష, రాజశేఖర్ ​తెలిపారు. బుధవారం నెన్నెల జోగాపూర్​అటవీ ప్రాంతంలో పర్యటించి వివిధ రకాల పక్షి జాతులను కెమెరాలతో బంధించారు.

పక్షుల ఆవాసాలు, వాటి జీవన విధానం, అవి తీసుకునే ఆహారం, నివసించే ప్రాంతాలు, వాటి అరుపులను క్షుణ్ణంగా పరిశీలించి వాటి వివరాలను అటవీ అధికారులకు వివరించారు. వివిధ జాతి పక్షుల మనుగడను ఎలా కాపాడుకోవాలో, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. బెల్లంపల్లి, కుశ్నపల్లి ఎఫ్​ఆర్​వోలు పూర్ణచందర్, దయాకర్, బెల్లంపల్లి డివిజన్​ అటవీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.