అంతర్గాం తహశీల్దార్ కార్యాలయంలో ACB రైడ్స్

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల తహశీల్దార్  కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అక్రమ ఇసుక రవాణాలో పట్టుబడ్డి ట్రాక్టర్ యజమాని నుంచి ఎం ఆర్ ఓ రమేష్, ఆర్ ఐ శ్రీధర్ రూ.12 వేల లంచం డిమాండ్ చేశారు. వారిపై బాధితుడు మహేష్ ఫిర్యాదు మేరకు ఏసిబి DSP రమణ మూర్తి కేసు నమోదు చేశారు. ఎం ఆర్ ఓ ఉయ్యాల రమేష్ ను అదుపులోకి తీసుకోగా, ఆర్ ఐ శ్రీధర్ పరార్ అయినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 

లింగపూర్ ఇసుక క్వారీ నుంచి అక్టోబర్ లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను  పోలీసులు సీజ్ చేసి అంతర్గాం ఎం ఆర్ ఓ కార్యాలయానికి తరలించారు. ట్రాక్టర్ ను వదిలిపెట్టేందుకు యజమాని మహేష్  నుండి రెవెన్యూ అధికారులు లంచం ఆశించడంతో ట్రాక్టర్ యజమాని ఏసిబిని ఆశ్రయించాడు. మంగళవారం కార్యాలయంలో మహేష్ నుంచి ఆర్ ఐ శ్రీదర్ రూ.12 వేలు నగదు తీసుకొని, ఏసిబి అధికారులను చూసి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు.  నిరుపేదనైన తనను రెవెన్యూ అధికారులు మానసికంగా ఆందోళనకు గురి చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్టు మహేష్ తెలిపాడు.

ALSO READ | కలెక్టర్‎పై దాడి కేసులో సురేష్ లొంగుబాటు