లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‫గా ACBకి దొరికిన తహశీల్దార్

ఏసీబీ అధికారులు నవంబర్ 2న లంచం తీసుకుంటున్న తహశీల్దార్‌ని పట్టుకున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్ తహశీల్దార్ తిరుపతి రూ.12 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. జైనూరు మండల తహశీల్దార్‌ దురిశెట్టి తిరుపతికి పోచంలొద్ది పంచాయతీ కార్యదర్శి శేఖర్ సహకరించాడు.

పోచంలొద్దికి చెందిన కాంట్రాక్ట్ కేంద్రే సుబోధ్ కాంత్ రూ.9.10 లక్షల బిల్లు పాస్ చేయడానికి తహసీల్దార్ లంచం డిమాండ్ చేశాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. బాధితుడు నగదు ఇస్తుండగా.. నిందితులను ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.