దళిత సంఘాల ఐక్య వేదిక కమిటీ రద్దు

  •     అడహక్ కమిటీ ఏర్పాటు 

బెల్లంపల్లి, వెలుగు: తెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక బెల్లంపల్లి పట్టణ కమిటీని ఆదివారం రద్దు చేశారు. పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్​లో దళిత సంఘాల ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాత కమిటీని రద్దు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. 

అడహక్ కమిటీ సభ్యులుగా డీఆర్.శ్రీధర్, గొడిసెల శ్రీహరి, కుంభాల రాజేశ్, దుర్గం గోపాల్, రత్నం ఐలయ్య, బుర్సా గోపాల్ ను నియమించారు. కార్యక్రమంలో దళిత సంఘాల లీడర్లు చిలుక రాజనర్సు, మల్లారపు చిన్నరాజం, కాసర్ల యాదగిరి, మాలే మోహన్ రావ్, రాంటెంకి హరికృష్ణ, బండి ప్రసాద్, గంధం రమేశ్, సోత్కు శ్రీనివాస్, దాసరి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.