సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టలేదని.. అన్నా వదినలను గుడి దగ్గర తాడుతో కట్టేశాడు ఓ తమ్ముడు. చుట్టూ జనం ఉన్నా.. చూస్తూ ఉన్నారు తప్ప ఎవరూ ఏమీ అనడం లేదు. వాళ్లను విడిపించే ప్రయత్నం చేయడం లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సిద్దిపేట పట్టణంలో పరశురాములు తన తమ్ముడు కనకయ్య దగ్గర అప్పుగా లక్షా 20 వేలు తీసుకున్నాడు. లక్ష రూపాయలు తిరిగి చెల్లించగా వడ్డీ 20 వేలు చెల్లించలేదు. దీంతో ఇద్దరు అన్నాదమ్ముల మధ్యగొడవ జరిగింది. వడ్డీ చెల్లించాలని పట్టుబట్టిన తమ్ముడు కనకయ్య తన అన్నా వదినలను గ్రామంలోని దేవాలయం ప్రాంగణంలో తాడుతో కట్టేశాడు . బాధితులు సిద్దిపేట వన్ టౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.