ఆసిఫాబాద్‌లో రైతుపై పులి దాడి..

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి చేనులో పని ఏరుతున్న మహిళపై రెండు రోజుల క్రితం పులి దాడి చేసి చంపేసింది. సరిగ్గా రెండు తర్వాత.. ఈ రోజు (నవంబర్ 30) అదే తరహాలో సిర్పూర్ టౌన్ దుబ్బగూడ గ్రామంలో మరో దాడి జరిగింది. దుబ్బగూడ గ్రామ శివారులో పత్తి ఎరుతుండగా రైతుపై పులి దాడి చేసింది. 

Also Read :- కానిస్టేబుల్ ఇంట్లో గంజాయి స్వాధీనం

రౌత్ సురేష్ అనే రైతుపై పులి అటాక్ చేసింది. సురేష్ కు తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. అధికారులు చుట్టుపక్కల గ్రామలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలకు భయంతో బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై పులులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.