మీరు మారరా..? హోటల్లో పాచిపోయిన చికెన్ బిర్యానీ

గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా  హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసినా యాజమానుల తీరు మారడం లేదు.నాణ్యత లేని ఫుడ్ పెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. లేటెస్ట్ గా మంచిర్యాల జిల్లా మంచిర్యాల బస్టాండ్ ఏరియాలో ఏరియాలోని A1 హోటల్ లో పాచిపోయిన చికెన్  బిర్యానీ పెట్టారు.  ఈ ఘటనను  కస్టమర్ వీడియో తీసి హోటల్ పై చర్యలు తీసుకోవాలని కోరాడు. 

నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన సాయినాథ్ తన కొడుకు చెన్నూరు గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. తన కొడుకుకు మూడు రోజుల క్రితం జ్వరం రావడంతో ఇంటికి తీసుకువెళ్లిన ఆయన తిరిగి మళ్లీ చెన్నూరు గురుకులంలో చేర్పించడానికి ఇవాళ మంచిర్యాలకు వచ్చాడు. ఆకలిగా ఉందని బస్టాండ్ పక్కనే ఉన్న A1 హోటల్ కి వెళ్లి  చికెన్ బిర్యాని ఆర్డర్ చేశాడు. దీంతో కొంచెం తినగానే ఫుడ్  వాసన రావడంతో హోటల్ సిబ్బందిని ప్రశ్నించాడు. 

  నాసిరకం ఫుడ్ ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో  హోటల్ మేనేజర్ తప్పు తమదేనని నిన్నటి బిర్యానీ పెట్టామని క్షమించాలని కోరారు. నిన్నటి ఫుడ్ ఇవాల ఎలా పెడతారని  ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాసిరకం ఫుడ్ పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి హోటల్స్ పై ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు తనిఖీలు చేసే చర్యలు తీసుకోవాలని కోరాడు బాధితుడు.