నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న సీడ్ కంపెనీ సీజ్

ములుగు, వెలుగు: నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న ఓ సీడ్​కంపెనీ యజమానిని స్పెషల్​ టాస్క్​ఫోర్స్​బృందం అదుపులోకి తీసుకొని అతడిపై పీఎస్​లో కేసు నమోదు చేశారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో జరిగింది. పట్టణంలోని  భారతి బయో జెనెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వివిధ కంపెనీల పేర్లతో ఉన్న నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను టాస్క్​ఫోర్స్​బృందం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కంపెనీ సీజ్​చేసి ఓనర్​కందికట్ల రామకృష్ణారెడ్డి అదుపులోకి తీసుకొని ములుగు పీఎస్​లో అప్పజెప్పారు.