ధర్మ పరిరక్షణ కోసం యాగం

శివ్వంపేట, వెలుగు : శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో  అయోధ్య రామ శర్మ ఆధ్వర్యంలో ధర్మం పరిరక్షణ, లోక కల్యాణం కోసం నాలుగు రోజులపాటు యాగం నిర్వహించనున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య మంగళవారం యాగం ప్రారంభమైంది. నర్సాపూర్​ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి,  ఎంపీటీసీ నరసింహారెడ్డి,  మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్,  నాయకులు సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.