కొడుకు, మనువడిపై పోలీసులకు కంప్లైంట్

  • ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని ఆందోళన
  • మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఘటన 

బెల్లంపల్లి, వెలుగు: వృద్ధాప్యంలో ఉన్న తనను కొడుకు, మనువడు ఇంట్లో నుంచి వెళ్లగొట్టారంటూ మంచిర్యాల బెల్లంపల్లి పట్టణంలోని టేకులబస్తీకి చెందిన ఓ వృద్ధుడు ఆందోళన చేశాడు. తనకు న్యాయం చేయాలని బెల్లంపల్లి వన్ టౌన్  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన రెండో కొడుకు  రాజనర్సు, మనువడు క్రాంతి తాను కట్టుకున్న మూడు రూముల ఇంట్లో ఉండొద్దంటూ టార్చర్  చేస్తున్నారని కొయ్యాడ నర్సయ్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. 

పోలీసులు న్యాయం చేయాలని వృద్ధుడు ఆందోళన చేశాడు. తనకు ప్రాణహాని ఉందని పేర్కొనడంతో, ఆదర్శ మహిళా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు దాసరి విజయ మంచిర్యాలలోని రెడ్ క్రాస్  సొసైటీ నిర్వహించే అనాథ శరణాలయానికి తరలించేందుకు ముందుకు వచ్చారు