ఏ.ఓ.స్మిత్ నుంచి 5-స్టార్ రేటెడ్ వాటర్ హీటర్లు

హైదరాబాద్, వెలుగు: -వాటర్ హీటింగ్, వాటర్ ట్రీట్ మెంట్ ప్రొడక్ట్స్ తయారీ సంస్థ ఏ.ఓ.స్మిత్ ఎలిగెన్స్ నియో సిరీస్ వాటర్ హీటర్లను భారత్ లో విడుదల చేసింది. ఇవి బీఈఈ 5 స్టార్​ రేటెడ్​ వాటర్​హీటర్లు కాబట్టి తక్కువ కరెంటును వాడుకుంటాయని పేర్కొంది.   బ్లూ డైమండ్ గ్లాస్-లైన్డ్ ట్యాంక్,  గ్లాస్ కోటెడ్ ఇన్కోలోయ్ హీటింగ్ వీటి ప్రత్యేకతలు.  రస్ట్ రెసిస్టెంట్ ఇంటిగ్రేటెడ్ డిఫ్యూజర్ టెక్నాలజీ వేడి నీటి ఉత్పత్తిని మరింత పెంచుతుంది.   ధరలు రూ.9,800 నుంచి మొదలవుతాయి.