మెదక్, వెలుగు: టీజీఎస్పీడీసీఎల్ నెట్వర్క్ సర్వే కోసం మొబైల్ యాప్ తయారు చేసినట్టు శనివారం ట్రాన్స్‌కో మెదక్ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ జానకి రాములు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్ తీగలు, ఫీడర్ల పని తీరు వివరాలను ఈ యాప్ ద్వారా రికార్డు చేస్తామని తెలిపారు. సోమవారం నుంచి అధికారికంగా ఈ ప్రక్రియ ప్రారంభిస్తునట్లు చెప్పారు.
మొదటి దశలో విద్యుత్ లైన్లు సర్వే పనులను చేపడుతున్నామని, మెదక్ టౌన్ పరిధిలో ఉన్న 10 ఫీడర్లను మొబైల్ యాప్ ద్వారా జీపీఎస్‌తో అనుసంధానిస్తామన్నారు. ప్రస్తుతం విద్యు త్ నెట్వర్క్ మ్యానువల్ గా ఉందని, ఈ ఆప్ ద్వారా సమస్యను సులభంగా గుర్తించే వీలుందని తెలిపారు.