కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థ అభివృద్ధిలో యువ ఉద్యోగులు కీలకంగా మారుతున్నారని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్అన్నారు. మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా కొత్తగా ఉద్యోగాలు పొందిన కార్మికుల డిపెండెంట్లకు సోమవారం మందమర్రి జీఎం ఆఫీస్‌లోని కాన్ఫరెన్స్హాల్లో జీఎం జాయినింగ్ఆర్డర్స్ అందజే శారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. మందమర్రి ఏరియా పరిధిలో కారుణ్య నియామకాల ద్వారా ఇప్పటి వరకు 1862 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
డ్యూటీలకు హాజరై సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. కార్యక్రమంలో సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ, సింగరేణి అధికారుల సంఘం ప్రెసిడెంట్ పైడీశ్వర్, పర్సనల్ మేనేజర్శ్యాంసుందర్, డీవైపీఎం సత్యబోసు, ఓఎస్ రాజలింగు తదితరులు పాల్గొన్నారు.