మాజీ ఎమ్మెల్యే రసమయికి మతి చలించింది : ఒగ్గు దామోదర్

బెజ్జంకి, వెలుగు: మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు అధికారం పోవడంతో మతి చలించిందని మాజీ ఎంపీపీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 200 యూనిట్ల కరెంట్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై  బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రూ. ఐదు కోట్ల నిధులను రద్దు చేయించారని ఆరోపణ చేయడం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్యే పౌల్ట్రీ ఫామ్ కోసం రెండెకరాల  ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. సమావేశంలో పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, జెల్ల ప్రభాకర్,  కొంకటి రాములు,  మహంకాళి ప్రవీణ్, రాజు పాల్గొన్నారు.