ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

కుంటాల, వెలుగు: ఆర్థిక ఇబ్బందులతో నిర్మల్​ జిల్లా కుంటాలకు చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. కుంటాల మండలం సూర్యాపూర్  గ్రామానికి చెందిన నేరెళ్ల లక్ష్మణ్(38) తనకున్న రెండెకరాల భూమిలో సోయా పంట వేశాడు. దిగుబడి రాకపోవడంతో పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం రూ.2 లక్షలు అప్పు చేశాడు. వాటిని తీర్చే మార్గం లేక గురువారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కరాచారి తెలిపారు.