ధర్మారం, వెలుగు: ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ ప్రమాదం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజేరుపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. ధర్మారం ఎస్సై శీలం లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. బంజేరుపల్లి తండాకు చెందిన నున్సావత్ రాజశేఖర్ (27), బానోతు సంతోష్‌నాయక్ (25) శుక్రవారం రాత్రి బైక్‌పై ధర్మారం వెళ్లారు. అక్కడ పని ముగించుకొని తిరిగి వస్తూ బంజేరుపల్లి గ్రామ సమీపంలో హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. దీంతో సంతోష్‌నాయక్ అక్కడికక్కడే చనిపోగా, రాజశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు రాజశేఖర్‌ను కరీంనగర్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. రాజశేఖర్ భార్య సునీత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శీలం లక్ష్మణ్ తెలిపారు.