వైభవంగా సాయిబాబా ఆలయ వార్షికోత్సవం

నారాయణ్ ఖేడ్, వెలుగు: పట్టణంలోని సాయిబాబా ఆలయ 9వ వార్షికోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. డోలా హరణం, పల్లకి సేవ,మహా హారతి, గణపతి హోమం కార్యక్రమాలు అర్చకులు నిర్వహించారు.

కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహారాజ్, పురోహితులు బ్రహ్మశ్రీ మోహన్ జోషి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆయన సతీమణి అనుపమ రెడ్డి పాల్గొన్నారు.