- 22 సెకండ్లలో 28 రాష్ట్ర రాజధానుల పేర్లు
జన్నారం, వెలుగు: పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు జన్నారం మండల కేంద్రానికి చెందిన 9 ఏండ్ల చిన్నారి అక్షరశ్రీ తన ప్రతిభతో అబ్బురపరుస్తోంది. కేవలం22 సెకండ్లలోనే దేశంలోని 28 రాష్ట్రాల రాజధానులను చెప్పేస్తోంది. అంతేకాదు 26 సెకండ్లలో 60 తెలుగు సంవత్సరాల పేర్లను గలగలా చెప్పేస్తూ వారెవ్వా అనిపిస్తోంది.
మండల కేంద్రంలోని శ్రీ కృష్ణవేణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 5వ తరగతి చదవుతున్న అక్షరశ్రీ ఏడేండ్ల వయసు నుండే భగవద్గీతలోని శ్లోకాలను చదువుతోంది. రోజు ఉదయం జనరల్ నాలెడ్జ్ పుస్తకాలతో పాటు హనుమాన్ చాలీసాలోని శ్లోకాలు, భగవద్గీతలోని శ్లోకాలను వల్లెవేస్తోంది. అక్షరశ్రీ చదువుకునే స్కూల్ లోనే ఆమె తల్లిదండ్రులు కస్తూరి సతీశ్, సంగీత టీచర్లుగా పనిచేస్తున్నారు.