టేక్మాల్, వెలుగు: టేక్మాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ యశ్వంత్ రెడ్డి, వైస్ చైర్మన్ వెంకయ్యలపై 8 మంది డైరెక్టర్ లు అవిశ్వాసం ప్రకటించారు. బుధవారం డీసీఓ కరుణను కలిసి అవిశ్వాసం నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ.. టేక్మాల్ సహకార సంఘంలో మొత్తం 13 మంది డైరెక్టర్లు ఉండగా ఒక్కరు మరణించారన్నారు.
పీఎసీఎస్ చైర్మన్ యశ్వంత్ రెడ్డి డైరెక్టర్లకు ఏ విషయం చెప్పడం లేదని, పాలకవర్గానికి తెలియకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఈ కారణంతోనే చైర్మన్ యశ్వంత్ రెడ్డి పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని తెలిపారు. అవిశ్వాసం నోటీస్ మీద డైరెక్టర్లు నర్సింహా రెడ్డి, పులి సత్యనారాయణ, పాపయ్య, నరేందర్, శ్రీరాములు, చందర్, లక్ష్మి, మంగమ్మ సంతకాలు చేశారు.