న్యూఢిల్లీ: ప్రైమ్ మినిస్టర్ ఇంటర్నషిప్ స్కీమ్ కింద సుమారు 6.21 లక్షల అప్లికేషన్లు అందుకున్నామని, సెలక్షన్ ప్రాసెస్ కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. దేశంలోని టాప్ 500 కంపెనీల్లో కోటి మంది యువతకు రానున్న ఐదేళ్లలో ఇంటర్న్‌షిప్ అందించాలని ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ ఏడాది యూనియన్ బడ్జెట్‌లో మొదటిసారిగా ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.27 లక్షల ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించేందుకు పైలెట్ ప్రాజెక్ట్ ఈ ఏడాది అక్టోబర్ 3 న ప్రారంభమైంది.
ఇంటర్న్‌షిప్ స్కీమ్ పోర్టల్‌లో వివిధ కంపెనీల్లోని అవకాశాలు పబ్లిష్ అయ్యాయి. సుమారు 4.87 లక్షల మంది తమ కేవైసీని పూర్తి చేశారు. కాగా, ఈ స్కీమ్ కింద ఇంటర్న్‌కు నెలకు రూ.5 వేల చొప్పున ఏడాది పాటు ఆర్థిక సాయం చేస్తారు. అదనంగా ఒకేసారి రూ.6 ఇస్తారు.