ముగిసిన రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడలు

ఆదిలాబాద్, వెలుగు: ఉట్నూర్​లో గత నాలుగు రోజులపాటు జరిగిన 5వ రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఓవరల్ ఛాంపియన్ గా భద్రాచలం నిలిచింది. గెలుపొందిన క్రీడాకారులకు కలెక్టర్ రాజర్షి షా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా బహుమతులు అందజేశారు.

కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీడలతో యువతలో మేథో శక్తి పెరుగుతుందన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించాలని ఆకాంక్షించారు. ఇన్​చార్జి మంత్రి సీతక్క ఇటీవల లాంచ్ చేసిన ట్రైబల్ యాప్ ను ఆశ్రమ పాఠశాలల్లో త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. అంతకుముందు అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు వరంగల్ జిల్లాకు చెందిన వెంకట నారాయణను సన్మానించారు.

స్కౌట్ అండ్ గౌడ్స్ డైమండ్ జూబ్లీ వేడుకలు

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: పిల్లల్లో కులమత వర్గ భేదాలు లేకుండా సమాన భావాలు కలిగి ఉండాలన్నదే స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్దేశమని కలెక్టర్​ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని సేవదాస్ విద్యమందిర్ వెనక ఉన్న గ్రౌండ్​లో నిర్వహించిన స్కౌట్ అండ్ గౌడ్స్ డైమండ్ జూబ్లీ వేడుకలకు హాజరై ప్రారంభించారు. డీఈవో ప్రణీత, వైస్ ప్రెసిడెంట్ కాంచనవల్లి రత్నాకర్, జిల్లా ట్రెజరర్​ మోహన్ బాబు పాల్గొన్నారు.