సిద్దిపేటలో 5కే రన్ నిర్వహణ

సిద్దిపేట, వెలుగు: లోకసభ ఎన్నికల్లో  జిల్లాలో ఓటరు శాతం పెంచేందుకు సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (SVEEP) ప్రోగ్రామ్ లో భాగంగా ఆదివారం సిద్దిపేటలో 5కే రన్ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మను చౌదరి జెండా ఊపి రన్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోలింగ్ లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 13న ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి జయదేవ్ ఆర్యా, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్, డిగ్రి కాలేజ్​లెక్చరర్లు, డీఆర్డీఏ కార్యాలయ సిబ్బంది, యువకులు, స్టూడెంట్స్​పాల్గొన్నారు.