కౌడిపల్లిలో 50 తులాల వెండి నగలు చోరీ

కౌడిపల్లి, వెలుగు: 50 తులాల వెండి నగలు చోరీ అయిన సంఘటన శుక్రవారం రాత్రి  కౌడిపల్లి లోని రాందేవ్ జువెలర్స్ షాప్ లో జరిగింది. షాప్ యజమాని ప్రేమ్ కుమార్ కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం షాప్ లో నగలు కొనుగోలు చేయడానికి ఇద్దరు మహిళలతో పాటు ఒక పురుషుడు వచ్చాడన్నారు. నగలు చూసి ఇస్తామని చెప్పి మాటలతో మాయ చేసి 30 తులాల కడియాలు, 20 తులాల పట్ట గొలుసులు చోరీ చేశారన్నారు. షాప్​ క్లోజ్​ చేసే ముందర నగలు చెక్ చేయగా 50 తులాల వెండి నగలు కనిపించ లేదు.  షాపులో ఉన్న సీసీ పుటేజ్ చెక్ చేయగా చోరీ విషయం బయటపడిందన్నారు. చోరీకి గురైన 50 తులాల వెండి ఆభరణాల విలువ రూ.40 వేలు ఉంటుందన్నారు. నగలు చోరీ చేసిన వ్యక్తులు ముగ్గురూ ఒకే బైక్ పై వచ్చారన్నారు. వారిని పట్టించిన వారికి రూ.5 వేల నగదు అందజేస్తానని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.