బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లి పట్టణంలోని కల్వరి మినిస్ట్రీస్ చర్చి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం చేపట్టిన 50 రోజుల ఉపవాస ప్రార్థనలు గురువారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అంతకుముందు పాస్టర్ ప్రవీణ్, సిస్టర్ షారోన్ పావురాలను ఎగరేసి ఈ ప్రార్థనలను ప్రారంభించారు.
వారు మాట్లాడుతూ.. బైబిల్ పఠనం చేయించి ఉపవాస దీక్షల ప్రత్యేకతను వివరించారు. పెద్ద సంఖ్యలో క్రైస్తవులు హాజరు కావడంతో కల్వరి చర్చి కిటకిటలాడింది. ప్రార్థనల ముగింపు సభ అక్టోబర్ 17 ఉంటుందని, క్రైస్తవులు ఈ ఉపవాస ప్రార్థనల్లో పాల్గొని ప్రపంచ శాంతి కోసం ప్రార్థించాలని కోరారు.